ప్రజలు నాపై పెట్టుకున్న ఆశలు నన్ను మరింత బలవంతుడ్ని చేస్తున్నాయి

పాదయాత్ర ముగింపుపై వైయస్‌ జగన్‌ ట్వీట్‌
 

అమరావతి:  ఏదో  ఒక సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వేచి చూస్తున్న రాష్ట్ర ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలు తనను మరింత బలవంతుడిని చేస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సందర్భంగా తన మనస్సులో నెలకొని ఉన్న భావోద్వేగాలను ట్విట్టర్‌ ద్వారా ఆయన ప్రజలతో పంచుకున్నారు.

‘‘పాదయాత్ర సమయంలో మీరు చూపించిన ప్రేమానురాగాలు నన్ను వినమ్రుడిని చేస్తున్నాయి. మీ బాధలు, వేదనలు నన్ను కదిలించాయి. మీరు నాపై పెట్టుకున్న ఆశలు నాలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్న నా కృతనిశ్చయం నన్ను కార్యదక్షత దిశగా మరింత బలవంతుడిని చేస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు.
 

Back to Top