పింగళి వెంకయ్య సేవలను ఈ దేశం ఎన్నటికీ మరవదు

 సీఎం  వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా సీఎం వైయస్ జ‌గ‌న్‌ ‘‘భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన.. పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top