ఈ విజయంతో మేం గర్వపడుతున్నాం: వైయ‌స్‌ జగన్‌

 టీమిండియా వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

అమ‌రావ‌తి : ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన కోహ్లిసేనకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ విజ‌యంపై మేం గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ గెలవాలన్న భారత్‌ దశాబ్దాల కల నెరవేరడం సంతోషంగా ఉంద‌న్నారు. ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించి దేశానికి కీర్తి తీసుకురావాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.   

Back to Top