విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి

మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి

అమ‌రావ‌తి:  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌రణ‌ను వ్య‌తిరేకిస్తూ ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అన్నారు. ఎంతో మంది ప్రాణ‌త్యాగాలు చేసి ఈ స్టిల్ ప్లాంట్‌ను కాపాడుకున్నార‌ని మంత్రి గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ కాకుండా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే కేంద్రానికి, ప్ర‌ధానికి లేఖ రాశార‌ని తెలిపారు. ప్రైవేటీక‌ర‌ణ కాకుండా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న లేఖ‌లో ఐదు ప్ర‌త్యామ్నాయాలు సూచించార‌ని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాల‌ని మంత్రి కోరారు.స్టీల్ ప్లాంట్ న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు అన్ని అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు.

ఏపీ వైద్య విద్య‌, ప‌రిశోధ‌న సంస్థ బిల్లుకు ఆమోదం
ఏపీ వైద్య విద్య‌, ప‌రిశోధ‌న సంస్థ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ ఎల‌క్రిసిటీ డ్యూటీ -2015 బిల్లు ర‌ద్దుకు స‌భ ఆమోదం తెలిపింది.ఏపీ మున్సిప‌ల్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు కూడా స‌భ్యులు ఆమోదం తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top