ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నదీమ్‌ అహ్మద్‌ ప్రమాణ స్వీకారం

విజయవాడ: ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నదీమ్‌ అహ్మద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..మైనారిటీలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని, ఆ ఘనత వైయస్‌ఆర్‌ కుటుంబానికే దక్కుతుందన్నారు. ఉర్దూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top