అవినీతికి మారుపేరు చంద్రబాబు

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఢిల్లీ: అవినీతి, దోపిడీ, అరాచకాలకు మారుపేరు చంద్రబాబు ప్రభుత్వమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వమే అవినీతిని స్పాన్సర్‌ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అన్ని స్థాయిల్లో అవినీతి ఏరులై పారుతోందన్నారు. ఏపీలో జరిగే అవినీతిని జాతీయస్థాయి సంస్థలు వెల్లడించాయన్నారు.

రఫెల్‌ కంటే అమరావతి స్కామ్‌ పెద్దదని వాటర్‌మాన్‌ రాజేంద్రసింగ్‌ చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధన 3 శాతం ఉండాల్సింది. 5 శాతం మించిందన్నారు. ఏపీలో చంద్రబాబు అవినీతి తారస్థాయికి చేరిందని చెప్పినా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. 

Back to Top