యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

 తిరుమల: ఎస్వీబీసీని యాడ్‌ ఫ్రీ ఛానల్‌గా మార్చాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాతల విరాళలతో ఎస్వీబీసీ ఛానల్‌ను నడుపుతామన్నారు. హిందీ, కన్నడ భాషల్లో కూడా ఎస్వీబీసీ ప్రాసారాలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవను నిర్వహిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో కరోనా బారిన పడిన అర్చకులందరూ కోలుకున్నారని ఆయ‌న‌  తెలిపారు.  భక్తుల దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Back to Top