రేపు వైయస్‌ఆర్‌సీపీ మ్యానిఫెస్టో కమిటీ సమావేశం

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ మ్యానిఫెస్టో కమిటీ రెండవ సమావేశం మార్చి 6న హైదరాబాద్‌ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని,మార్చి 3న పార్టీ అనుబంధ సంఘాల సభ్యులతో జిల్లాలో నిర్వహించిన సమావేశాల్లో ప్రతిపాదించిన మ్యానిఫెస్టోలో చేర్చదగిన ముఖ్యమైన అంశాలను క్రోడికరించుకుని మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు.

Back to Top