తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (13.09.2024) కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమైన గ్రామాల్లో వైయస్ జగన్ పర్యటిస్తారు. ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి రమణక్కపేట వెళతారు, అక్కడ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుని మధ్యాహ్నం అక్కడినుంచి తాడేపల్లి తిరుగుపయనమవుతారు.