నేడు తిరుప‌తికి  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రేణిగుంటలో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, ముఖ్య‌మంత్రి

తిరుపతి : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు మంగళవారం ఉదయం తిరుపతికి రానున్నారు. ఉద‌యం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ వారికి రాష్ట్ర గవర్నర్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలుకుతారు.  రేణిగుంటలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.  
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఏర్పాట్లను  పరిశీలించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top