నేడు కొవిడ్‌పై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష 

తాడేప‌ల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్న కర్ఫ్యూ ఆంక్షలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుండి రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పగటి పూట కర్ఫ్యూ అమలులో ఉన్న జిల్లాల్లో కూడా పాజిటివిటీ రేటు తగ్గుతుండడంతో సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top