నేడు సీఎం వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఇవాళ రాష్ట్ర కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో వైయ‌స్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించనున్నారు. నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర‌నుంది. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి  కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. వైయ‌స్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై స‌మావేశంలో చ‌ర్చ‌కు రానుంది. ఇక సెప్టెంబర్‌ 5న ఇచ్చే వైయ‌స్‌ఆర్‌ విద్యా కానుకకు ఈ కేబినెట్ స‌మావేశంలో ఆమోదం తెలపనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top