న్యూ ఢిల్లీ: రాజ్యసభ సభ్యులుగా వైయస్ఆర్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. రాజ్యసభలో వైయస్ఆర్‌సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైయస్ఆర్‌సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్ఆర్‌సీపీదే. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది.