బూత్‌ కమిటీలకు దిశా నిర్దేశం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం

సమర శంఖారావానికి భారీగా తరలివస్తున్న కార్యకర్తలు

 

తిరుపతి: తిరుపతి సమరశంఖారావం సభా వేదిక సాక్షిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. తిరుపతి సమర శంఖారావం సభా వేదిక వద్ద తలశిల రఘురాం మీడియాతో మాట్లాడుతూ.. బూత్‌ కమిటీ కన్వీనర్లతో మొదటిసారి సమావేశమవుతున్నారన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలని దిశా నిర్దేశం చేస్తారన్నారు. సభకు బూత్‌ కమిటీ కన్వీనర్లు పెద్ద ఎత్తున తరలివస్తారన్నారు.  

Back to Top