వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు...

తూర్పుగోదావరి:రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు. తాజాగా  వైయస్‌ఆర్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్,రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నాగులపల్లి ధనలక్ష్మి సమక్షంలో చింతూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 160 కుటుంబాలు,ఎటపాక మండలంలో 200 కుటుంబాలు పార్టీలోకి చేరాయి.

చింతూరు మండలం గూడూరులో సీపీఎంకు చెందిన తాజా మాజీ సర్పంచి మడివి గౌరమ్మ ఆధ్వర్యంలో 45 కుటుంబాలవారు పార్టీలోకి చేరారు. అలాగే నర్సింహాపురంలో కమ్మల జయరాజు ఆధ్వర్యంలో సీపీఎం,టీడీపీ,ఎవీఎస్పీకి చెందిన 105 కుటుంబాలు, మామిళ్లగూడెంలో మాచ్చిక ధర్మయ్య ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 10 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి.ఎటపాక మండలం చోడవరం గ్రామ పంచాయతీలో టీడీపీ,సీపీఎం,సీపీఐ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు పార్టీలోకి చేరాయి.

 

Back to Top