జమ్ములమడుగులో టీడీపీకి షాక్‌

ఆదినారాయణరెడ్డి అనుచరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
 

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ జిల్లాజమ్ముల మడుగులో అధికార తెలుగు దేశం పార్టీకి షాక్‌ తగిలింది. టీడీపీకి చెందిన నేతలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి  అనుచరులు టీడీపీ వీడి వైయస్‌ఆర్‌సీపీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అనుచరులు ముని రాజారెడ్డి, బొందల గుంట సుబ్బయ్య, స్టాల్‌ పీరా సోదరులు, పెద్ద ముడియం, ఈశ్వర్‌రెడ్డి, దస్తగిరిరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.

వీరికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి వైయస్‌ఆర్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, జమ్ములమడుగు ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సుదీర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

 

Back to Top