పేట్రేగిపోతున్న టీడీపీ అరాచక శక్తులు..

వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు..

వైయస్‌ఆర్‌సీపీ నేతలపై రాళ్లు రువ్విన టీడీపీ కార్యకర్తలు..

ప్రకాశం: రాష్ట్రంలో టీడీపీ అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. అధికార టీడీపీ ప్రభుత్వం పాలనలో పచ్చ చొక్కాలు ఇష్టారాజ్యంగా చేలరేగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. కమ్మపాలెంలోకి వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాకూడదని టీడీపీ నేతల హుకుం జారీ చేశారు. ఒంగోలు కోర్టు సెంటర్‌ వద్ద బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైయస్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభిస్తామని బాలినేని తెలిపారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేయగా పలువురు గాయపడ్డారు.టీడీపీ అరాచకాలకు నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

Back to Top