టీడీపీ..సీపీఎం నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

వైయస్‌ జగన్‌ సమక్షంలో మామిడిపల్లి, పలాస నియోజకవర్గ టీడీపీ, సీపీఎం నేతలు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జననేత పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంరద్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ..చంద్రబాబును నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందన్నారు. రేషన్‌కార్డులు, పెన్షన్‌కు రూ. 1000,ఇల్లు కావాలంటే రూ.10 వేలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. 
 

Back to Top