పేట్రేగిపోతున్నటీడీపీ అరాచ‌క శ‌క్తులు...

వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి

అనంతపురం:రాష్ట్ర‌వ్యాప్తంగా టీడీపీ అరాచ శ‌క్తులు ప్రేటేగిపోతున్నాయి. టీడీపీ నాయకులు అధికారమదంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తునే ఉన్నారు. తాజాగా గుత్తి మండలం ధర్మాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత రామాంజనేయుపై టీడీపీ నేతలు రాజేంద్ర, బాలరాముడు దాడి చేసి తీవ్రంగ గాయపరిచారు. ఈ దాడికి గల కారణం రామాంజనేయులు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాడనే అక్కసుతోనే అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన వైసీపీ నేత రామాంజనేయులును ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top