చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా..గెలుపు వైయస్‌ఆర్‌సీపీదే..

రాష్ట్రవ్యాప్తంగా కావాలి జగన్‌–రావాలి జగన్‌...

తూర్పుగోదావరి: హోదా కోసం చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ కాకినాడ సిటీ కోఆర్డీనేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మండిపడ్డారు. కాకినాడ సిటీ దుమ్ముపేటలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసిన  చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.పిఠాపురం మండలం కోలంకలో వైయస్‌ఆర్‌సీపీ నేత పెండెం దొరబాబు ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టి నవరత్నాలను ప్రజలకు వివరించారు.

నవరత్నాలతో అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.శృంగవృక్షంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నవరత్నాలను వివరించారు. వైయస్‌ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. చంద్రబాబు దొంగదీక్షలను ప్రజలను గమనిస్తున్నారన్నారని తెలిపారు.చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లాలో.. 

కృష్ణా జిల్లా పామర్రులో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు.ఇంటింటికి తిరిగి వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాలను వివరించారు. వైయస్‌ఆర్‌సీసీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అనిల్‌కుమార్‌ అన్నారు. ప్రజలంతా ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top