కాసేప‌ట్లో వైయ‌స్ఆర్ వేదాద్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి శంకుస్థాప‌న‌

రిమోట్ ద్వారా ఫైలాన్‌ను ఆవిష్క‌రించ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  కృష్ణా జిల్లాలోని వైయ‌స్ఆర్ వేదాద్రి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని కాసేప‌ట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ ప‌థ‌కం ఫైలాన్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రిస్తారు. వేదాద్రి గ్రామంలో ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్ శంకుస్థాప‌న చేస్తారు. ఈ ఎత్తిపోత‌ల‌తో జగ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని బీడు భూములు స‌స్య‌శ్యామ‌లం కానున్నాయి. రూ.368 కోట్ల వ్య‌యంతో ఈ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని 18 నెల‌ల్లో పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. జ‌గ్గ‌య్య‌పేట‌లో 8 గ్రామాల‌కు, వ‌త్స‌వాయి మండ‌లంలో 10 గ్రామాల‌కు, పెనుమంచిప్రోలు గ్రామంలో 10 గ్రామాల్లో 38,607 ఎక‌రాలు సాగులోకి రానున్నాయి. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top