ఏపీలో ధాన్యం సేకరణ బ్రహ్మాండంగా జరుగుతోంది 

పౌరసరఫరాల శాఖామంతత్రి కారుమూరి నాగేశ్వరరావు
 

ఢిల్లీ: కేంద్ర ప్రజా పంపిణీ శాఖ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 1702 కోట్ల బకాయిలు వచ్చే వారంలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారని ఏపీ పౌరసరఫరాల శాఖామంతత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

ఏపీలో ధాన్యం సేకరణ బ్రహ్మండంగా జరుగుతుందని, ఇప్పటికే 13 లక్షల 14 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించిన విషయాన్ని మంత్రి కారుమూరి తెలిపారు. అదే సమయంలో ధాన్యం సేకరణలో భాగంగా రూ. 750 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఏపీ ప్రజా పంపిణీ శాఖలో డిజిటలైజేషన్‌పై కేంద్రం అభినందించిందన్నారు.

Back to Top