వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో గ‌ణ‌తంత్ర వేడుక‌లు 

తాడేపల్లి :   వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఆయా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్న‌ర కాలంలోనే  ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు అమలు చేశారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రతి గడపకు ఆయన సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Back to Top