హైకోర్టులో వైయస్‌ఆర్‌సీపీ నేతలకు ఊరట

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వైయస్‌ఆర్‌సీపీ నేతలకు ఊరట లభించింది. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, దేవినేని అవినాష్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిపారు. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేశారు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 

Back to Top