కరోనా కట్టడిలో  ఏపీ చర్యలు భేష్‌

మరోసారి ప్రశంసలు కురిపించిన రాజ్‌దీప్‌
 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ప్రశంసించారు. కేసులు పెరుగుతున్నా.. ఏపీ సర్కార్‌ టెస్టులు తగ్గించకపోవడం అభినందనీయం అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వైరస్‌ కట్టడి కోసం ఏపీ అనుసరిస్తోన్న పద్దతి ప్రశంసనీయం అన్నారు. 

కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా.. ఏపీలో కరోనా లెక్కలను దాచడంలేదన్నారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేటింగ్‌.. ఇవే కరోనా కట్టడికి మార్గాలన్నారు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. ఈ మేరకు ఆయన  ట్విట్‌ చేశారు. గతంలో ఏపీలో 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించనప్పుడు కూడా రాజ్‌దీప్‌.. క్లిష్ట సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించిన సంగతి తెలిసిందే.  

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం టెస్టులను తగ్గించడం లేదు. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై 31 నాటికి రాష్ట్రంలో 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ముందంజలో ఉంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top