రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు

కోటబొమ్మాళిలో వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం ధ్వంసం

వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు గాయాలు

శ్రీకాకుళం: అధికార అహం రోజు రోజుకు మితిమీరిపోతుంది. ఆంధ్రరాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు తెగబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. కార్యాలయంలోకి చొరబడి ఇసుప రాడ్లతో ఫర్నీచర్, ఫైల్స్‌ను ధ్వంసం చేశారు. ఇదేమని ప్రశ్నించిన వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతల దాడుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

దాడిని నిరసిస్తూ...

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కోటబొమ్మాళిలో ర్యాలీ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో పోలీస్‌ స్టేషన్‌ ఉన్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే టీడీపీ నేతలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది.  

 

Back to Top