వైయస్‌ఆర్‌సీపీలోకి రజక సంఘం నేత...

తూర్పుగోదావరి: రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీలోకి భారీస్థాయిలో చేరికలు పెరుగుతున్నాయి.వివిధ పార్టీలు,సంఘాలకు చెందిన నేతలు పార్టీలోకి ఆకర్షితులవుతున్నారు.వైయస్‌  జగన్‌మోహన్‌ రెడ్డిపై నమ్మకంతోనే పార్టీలోకి చేరుతున్నట్లు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరజక సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇరుసుమళ్ల విష్ణు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆయనతో పాటు పలువురు రజక సంఘం రాష్ట్ర ప్రతినిధులు పార్టీలోకి చేరారు.

జిల్లా కేంద్రం కాకినాడకు చెందిన ఆయన ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల పార్టీ అదనపు ప్రాంతీయ పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు రజక చైతన్య సంఘాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే విష్ణు వైయస్‌ఆర్‌సీపీ విధానాలకు ఆకర్షితులై పార్టీలోకి  చేరారు. ఈ సందర్భంగా ఆయనకు సుబ్బారెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.బీసీ వర్గాలను దగా చేసిన చంద్రబాబు తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. 

 

Back to Top