సమస్యలు తీర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చింది

వైయ‌స్ఆర్‌ కుటుంబంలా మ‌రెవ‌రూ పాదయాత్ర చేయలేదు

సినీ న‌టుడు పృథ్వి

శ్రీ‌కాకుళం: సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందని సినీ న‌టుడు పృథ్వి అన్నారు
 వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతం కావడానికి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని సినీ నటుడు పృథ్వి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరో నటుడు కృష్ణుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో వైయ‌స్‌ పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. సమస్యలు తీర్చే ప్రజా నాయకుడు తమ ముందుకు వచ్చాడన్న నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. మహానేత వైఎస్సార్‌ లేని లోటు తీరుస్తారన్న భరోసా జనానికి కలిగిందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో లక్షలాది మంది స్వచ్ఛందంగా ప్రతిరోజు జగన్‌ వెంట నడిచారని వెల్లడించారు. దేశ చరిత్రలో ఏ కుటుంబం కూడా వైయ‌స్ఆర్‌ కుటుంబంలా పాదయాత్ర చేయలేదని పృథ్వి గుర్తు చేశారు.

చంద్రబాబు విఫలం: కృష్ణుడు
టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని నటుడు కృష్ణుడు అన్నారు. ప్రజలంతా జగన్‌ వెంటే ఉన్నారని అభి​ప్రాయపడ్డారు. పాదయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యల గురించి చెప్పుకున్నారని తెలిపారు. ప్రజాసంకల్పయాత్రతో వైయ‌స్ జగన్‌ పరిపూర్ణమైన నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం వైయ‌స్ఆర్‌ కుటుంబం ఎంతో చేసిందన్నారు.

Back to Top