ద్రోణంరాజుకు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల నివాళులు 

విశాఖ :  మాజీ ఎమ్మెల్యే, వీఆర్‌ఎండీఏ మాజీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మృతి పట్ల వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు  దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతను కడసారిగా చూసేందుకు పెద్దఎత్తున నగర ప్రజలు, నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమవుతున్నారు. విశాఖ అభివృద్ధి లో ద్రోణం రాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైయ‌స్సార్‌సీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.ఈ మ‌ధ్యాహ్నం త‌ర్వాత‌ ద్రోణంరాజు అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయానికి  పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు,  డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే అదీప్ రాజ్,  రూరల్ అధ్యక్షుడు శరగడం చిన్న అప్పలనాయుడు నివాళులు అర్పించారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top