గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ మరణాలు లేవు

 మరో 73 పాజిటివ్‌ కేసులు
 
మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1332

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరిందని వెల్లడించింది. తాజాగా 29 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 287కు చేరుకుందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో  ఎంటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1014 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top