7 జిల్లాల్లో నమోదు కాని కరోనా కేసులు

ఇవాళ 140 మంది డిశ్చార్జ్‌

24 గంటల్లో 60 పాజిటివ్‌ కేసులు నమోదు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల వ్యవధిలో 7,782 మందికి పరీక్షలు నిర్వహించగా 60 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇవాళ కొత్తగా 140 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 729 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. 

Back to Top