అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌

అమరావతి: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై కొత్త రూలింగ్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. వైట్, రెడ్, గ్రీన్‌ లైన్స్‌ ఏర్పాటు చేయాలని శ్రీకాంత్‌రెడ్డి సభలో ప్రతిపాదించారు. ఆ లైన్స్‌ దాటితే ఆటోమాటిక్‌గా సభ్యుల సస్పెన్షన్‌ అవుతారని తెలిపారు. రూల్‌ కమిటీకి స్పీకర్‌ తమ్మినేని సీతారాం సిఫార్స్‌ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించిన మోషన్‌కు శాసన సభ ఆమోదం తెలిపింది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top