జగన్‌ ప్రకటించిన పథకాలు చంద్రబాబు కాపీ కొడుతున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లాః నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఏ హామీ నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి అన్నారు.చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారన్నారు.వైయస్‌ జగన్‌ ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు.నవరత్నాల్లోని రూ.2వేల పెన్షన్‌ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారన్నారు.చంద్రబాబు కుట్రలు, మోసాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.ఏపీని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు.రాష్ట్ర పర్యటనలో వైయస్‌ జగన్‌ ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు.

 

Back to Top