అమరావతి: నేషనల్ హైవే కన్సల్టింగ్ కమిటీ సభ్యులుగా వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, లోక్‌సభ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది.