వైజాగ్‌కు 9వ ర్యాంకు రావ‌డ‌మే వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి 

తాడేప‌ల్లి:  విశాఖ‌ప‌ట్నం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని, స్వచ్ఛ సర్వేక్షన్ లో వైజాగ్ కు 9వ ర్యాంకు రావడమే దీనికి నిదర్శనమ‌ని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గ‌తంలో 23వ స్థానంలో ఉన్న విశాఖ‌ప‌ట్నం  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో  9వ ర్యాంక్‌కి చేరుకుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం జగ‌న్ నాయ‌క‌త్వంలో  విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్న జీవీఎంసీ కి అభినందనలు తెలుపుతూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top