తండ్రి, కొడుకుల‌కు ప్ర‌జ‌లంటే అంతులేని ప్రేమ‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, సీఎంవైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిల‌కు ప్ర‌జ‌లంటే అంతులేని ప్రేమ అని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. మ‌హానేత వైయ‌స్ఆర్ జ‌యంతి సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.ప్ర‌జ‌ల గుండెల్లో వైయ‌స్ఆర్ చిర‌స్థాయిగా నిలిచిపోయార‌న్నారు. పేద‌ల ప‌క్ష‌పాతిగా నిలిచిన ఆయ‌న 71వ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నామ‌న్నారు. వైయ‌స్ఆర్ సేవ‌ల‌ను మ‌న‌నం చేసుకుందామ‌న్నారు. రైతు బాంధ‌వుడు వైయ‌స్ఆర్ జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నామ‌న్నారు.

Back to Top