ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా  సీఎం కుర్చీ ఎక్కుతాడట!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి 

విశాఖ‌:  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో బీజేపీ, జ‌నస‌సేన తీరును వైయ‌స్ ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎండ‌గ‌ట్టారు. ఈ మేర‌కు బుధ‌వారం విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు. జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం  ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో  ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా  సీఎం కుర్చీ ఎక్కుతాడట! అంటూ  విజ‌య ‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top