కోవిడ్ విప‌త్తులోనూ `ఉపాధి`

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

 
విశాఖ‌:  కోవిడ్ క‌ష్ట‌కాలంలోనూ ప్ర‌జ‌ల‌కు ఉపాధి ప‌నులు క‌ల్పించి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ‌గా నిలిచార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. కోవిడ్‌ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యమని, జూన్ చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్న లక్ష్యం చేరాలంటే ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు ఉన్నతాధికారులను ఆదేశించారు.

చదువు 'కొన్న' వాడికి పరీక్షల విలువ ఏం తెలుస్తుంది? 
తండ్రి కంటే కొడుకు ఒక ఆకు ఎక్కువే చదివాడని కిరీటం పెట్టించుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు మాలోకం. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తే అది తన ఘనతే అని జబ్బలు చరుచుకుంటున్నాడు. చదువు 'కొన్న' వాడికి పరీక్షల విలువ ఏం తెలుస్తుంది? శుద్ధ మొద్దులకే పరీక్షలంటే భయం అంటూ అంత‌కు ముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top