విశాఖ: వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా 18-45 మధ్య వయసు వారికి టీకాలు ఎలా సాధ్యమని ఎల్లో మీడియా రాష్ట్ర ప్రభుత్వాన్ని హేళన చేస్తోంది. ఇది కేంద్రాన్ని అడగాల్సిన ప్రశ్న అంటూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. దిగుమతి చేసుకొనైనా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. సిఎం వైయస్ జగన్ గారి చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సీఎం వైయస్ జగన్ ముందుచూపు దేశంలో లక్ష జనాభాకు సరాసరిన 91 మంది డాక్టర్లుండగా ఏపీలో 196 మంది ఉన్నారు. మరో నాలుగైదేళ్లలో వైద్యుల లభ్యత భారీగా పెరుగుతుంది. సిఎం జగన్ గారు ముందు చూపుతో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేశారు. 7500 కోట్లతో కాలేజీ భవనాల నిర్మాణాలు చేపట్టారని అంతకుముందు చేసిన ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.