బాబును త‌క్ష‌ణ‌మే ఎర్ర‌గ‌డ్డ‌లో చేర్చాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. పోలీసు అధికారులను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు చూస్తుంటే తక్షణం ఎర్రగడ్డలో చేర్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందరి వివరాలు రాసుకున్నాడంట. ఆధారాలు కూడా ఉన్నాయంట. జమిలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిన వెంటనే ఆయన సిఎం అయి తన పవరేంటో చూపిస్తాడంట అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి 23 సీట్లకు పరిమితమైన తర్వాత చంద్రబాబు ఇలాగే గుడ్డలు చించుకుని మాట్లాడాడు. ఇప్పుడూ అదే ఏడుపు రిపీట్ అయింది. ఎప్పటిలాగే అధికారులను, పోలీసులను బెదిరించాడు. వైయ‌స్సార్ కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు తప్పు చేసారని తేల్చాడు. మతి పూర్తిగా భ్రమించిందని అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top