బాబు చేసిన పాపాలు పది జన్మలెత్తినా పరిహారం కావు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్వీట్

న్యూఢిల్లీ: చంద్ర‌బాబు చేసిన అవినీతిని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. నువ్వు దోచుకున్న లక్షల కోట్లతో రాష్ట్ర ప్రజలందరికి పదేళ్ల పాటు మూడు పూటలా భోజనం పంపిణీ చేయొచ్చే చంద్రబాబూ. సంవత్సరంలో ఒక్క రోజు తిరుమల దేవస్థానంలో అన్నదానం చేయడం నీ స్థాయికి చాలా తక్కువ. వందల గుళ్లను కూల్చినోడివి. చేసిన పాపాలు పది జన్మలెత్తినా పరిహారం కావు అంటూ విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈజ్ పథకం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చేపట్టిన సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరించడానికి చేపట్టిన చర్యల గురించి రాజ్యసభలో ఆర్థిక మంత్రిని ప్రశ్నించిన‌ట్లు అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో విజ‌య ‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top