బాబు మెప్పు కోసం అశోక్ స‌రెండ‌ర్‌

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌: చంద్రబాబు మెప్పు కోసం మాన్సాస్ విద్యాసంస్థలకు రావాల్సిన 35 కోట్ల స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్ మెంట్ ను వదిలేశాడు అశోక్. ఛైర్మన్ గా ఉండగా ఒక్క లేఖా రాయలేదు. ఏ ఏడాదికాయేడాది ఆన్లైన్లో అప్లై చేయాలన్న స్పృహలేదు. ఆర్థికంగా భారంగా మారాయని 2017లోనే పలు విద్యాసంస్థలను సరెండర్ చేశాడని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి  ట్వీట్ చేశారు. 

మెడికల్ కాలేజి పెడతామని మాన్సాస్ భూముల్ని తెగనమ్మాడు అశోక్. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టకుండా అడ్డుకున్నాడు. గత నెలలో జగన్ గారు విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. నీ మెడికల్ కాలేజ్ ప్రతిపాదన ఏమైపోయింది అశోక్?

తూ.గో జిల్లా కోటిపల్లి మాన్సాస్ భూముల్లోని ఇసుకాసురులెవరు? 2020లో ఏపీఎండీసీకి అప్పగించక ముందు అక్కడ ఇసుక మైనింగ్ చేసిందెవరు? టీడీపీ హయాంలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే కళ్లు మూసుకున్నావా అశోక్? సొంతపార్టీ నేతలు తవ్వేస్తుంటే దృతరాష్ట్రుని పాత్ర పోషించావా? వాటాలు తీసుకుని ఊరుకున్నావా?

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top