వైయ‌స్ఆర్ చేయూత‌తో పేద‌రికానికి చెక్‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కంతో పేద‌రికానికి శాశ్వ‌తంగా చెక్ ప‌డుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు ఏడాదికి రూ.18,750 చొప్పున మొత్తం నాలుగేళ్ల పాటు నేరుగా ల‌బ్ధిదారుల అకౌంట్ల‌లోకే డ‌బ్బులు జ‌మా అవుతాయ‌న్నారు.  జీవ‌నోపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు న‌డుపుకోవ‌డానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

కాగా ఈ నెల 12వ తేదీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని  25మ‌ ల‌క్ష‌ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు ఒక్కొక్క‌రికి రూ.18,750 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జ‌మ అయిన విష‌యం విధిత‌మే. దీంతో మ‌హిళ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ..రాష్ట్ర‌వ్యాప్తంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకం చేస్తున్నారు. 

Back to Top