సంక్షేమం..అభివృద్ధికి స‌మ ప్రాధాన్య‌త‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

విశాఖ‌:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో సంక్షేమం, అభివృద్ధి స‌మానంగా సాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో.. అభివృద్ధికి అంతే  ప్రాధాన్యం ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రానికి రూ.34వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 1,30,565 మందికి ఉపాధి లభించింద‌ని ట్వీట్ చేశారు.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారి నాయకత్వంలో రాష్ట్రం పలు అంశాల్లో నీతి ఆయోగ్ ప్రశంసలు పొందింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఏపీ.. విద్యుదీకరణలో మొదటి స్థానం దక్కించుకుంద‌ని అంత‌కు ముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top