ప్రజలకు వాస్తవాలు తెలుసు ఉమా!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  ఇసుక విధానంపై విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీ నేత దేవినేని ఉమాకు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు.  కృష్ణ తీరం వెంట 20 ఏళ్ల పాటు ఇసుక మాఫియాలతో విధ్వంసం సృష్టించి వేల కోట్లు దోచుకున్న ఉమ...సిఎం వైయ‌స్‌ జగన్ గారి ఇసుక విధానాన్ని విమర్శిస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్టుంది. పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక వెలికతీత, పంపిణీ జరుగుతోంది. ప్రజలకు వాస్తవాలు తెలుసు ఉమా.. అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

మహిళా పక్షపాతి అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు అన్ని పథకాలు అక్కాచెల్లెమ్మల పేరిటే అందిస్తూ వారికి అగ్రాసనం వేశారు. రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.89,234 కోట్ల లబ్ధి చేకూర్చార‌ని మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు.

కొత్తగా నిర్మించే వైయ‌స్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 33 వేల కోట్లు వ్యయం చేస్తుంది. టౌన్ షిప్పులకు గేట్లు ఉండక పోవచ్చు గాని గేటెడు కమ్యూనిటీల్లో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. మంచినీరు, సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజి వ్యవస్థలతో ఆధునికంగా కనిపిస్తాయ‌ని అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top