మీ ఇద్దరి కేసులపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి ఉమ

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 
 

విశాఖ‌:  టీడీపీ అధినేత చంద్ర‌బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమాపై న‌మోదైన కేసుల‌పై విచార‌ణ జ‌రిపితే ఆ ఇద్ద‌రు జీవితాంతం జైల్లోనే గ‌డ‌పాల్సి వ‌స్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి శనివారం ఓ ట్వీట్ చేశారు.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి మాటలను వక్రీకరించేలా వీడియో మార్ఫింగ్ చేసి అడ్డంగా దొరికాడు ఉమా. సీఐడీ విచారణకు వెళ్లి కొత్త స్టోరీ అల్లాడు. 20 కేసుల్లో స్టేలతో గడుపుతున్న  చంద్రబాబు పత్తిగింజ అయినట్టు, ఇరికించాలని చూస్తున్నారట. మీ ఇద్దరి కేసులపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి ఉమ' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

తాజా వీడియోలు

Back to Top