ప్ర‌జారోగ్యానికి పెద్ద‌పీట‌..జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ‌ సంక‌ల్పం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి 

విశాఖ‌:  ప్ర‌జారోగ్యానికి పెద్ద‌పీట వేస్తూ జ‌గ‌నన్న ‌స్వ‌చ్ఛ సంక‌ల్ప కార్య‌క్ర‌మాన్ని మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభిస్తార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ పల్లెల పరిశుభ్రతకు సంకల్పించింది. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో అమలు చేయనున్న ఈ కార్యక్రమానికి జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు శ్రీకారం చుట్టనున్నారు అని ట్విట్ట‌ర్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
 

పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా? 

 విశాఖ‌:  తెలుగు దేశం పార్టీకి కొత్త నాయ‌క‌త్వం వ‌స్తుంద‌న్న టీడీపీ సీనియ‌ర్ నేత బుచ్చ‌య్య చౌద‌రికి వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. తండ్రీకొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయట పడేదెప్పుడు? పచ్చ పార్టీకి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా? త్వరలో చీలికలు, పీలికలు అయి ఎవరి ముక్క వాళ్లు లాక్కెళ్తారని సూటిగా చెప్పొచ్చుగా. నూతన నాయకులు రావడానికి ఏం మిగిలిందని? ఎన్టీఆర్ స్థాపిస్తే బాబు సమాధి చేశాడు పార్టీని అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

Back to Top