టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు డిమాండు చేయడం వింతగా లేదూ?

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి 

 

విశాఖ‌:  టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిపై వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ఎంపీ విజ‌య సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిపడ్డారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ముఖ్య‌మంత్రిగా ప్రమాణం చేసే నాటికి ఖజానాలో రూ. 100 కోట్లు మాత్రమే మిగిలాయి. దొరికిన చోటల్లా మేమే అప్పులు తెచ్చాం. ఇంకెక్కడా రూపాయి  అప్పు పుట్టదు అని పబ్లిగ్గానే చెప్పిన యనమలకు శ్వేత పత్రం కావాలట. ఆర్థిక నిర్వహణలో దేశంలోనే చెత్త ఫైనాన్స్ మినిష్టర్ ఇలా డిమాండు చేయడం వింతగా లేదూ? అంటూ విజ‌య సాయిరెడ్డి ట్విట్ చేశారు.
 

Back to Top