ఏపీలో మరిన్ని కేవీలు ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉందా?

రాజ్యసభలో విద్యా శాఖ మంత్రిని ప్రశ్నించిన ఎంపీ విజయసాయి రెడ్డి
 

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యావకాశాలను అన్ని ప్రాంతాలకు సమంగా విస్తరించేలా చూసేందుకు మరిన్ని కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా అని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి విద్యా శాఖ మంత్రిని ప్రశ్నించారు.
దీనికి విద్యా శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రదాన్‌ జవాబిస్తూ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ఒక విధానం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికమంది ఉండే ప్రాంతాల్లో మాత్రమే వారి పిల్లలకు విద్యావకాశం కల్పించేందుకు ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తుంది తప్ప జిల్లాల ప్రాతిపదికన కేవీల ఏర్పాటు జరగదని, అది ప్రభుత్వ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top