రేపు పాడేరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన

వైయ‌స్ఆర్‌‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి
 

విశాఖ‌: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలోనూ మెడికల్‌ కాలేజీ ఏర్పాటే చేస్తామని, ఎజెన్సీ ప్రాంతంలో మౌలిక వసతులను కల్పిస్తామని వైయ‌స్ఆర్‌‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్2న విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నామని పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top